పుట:Baarishhtaru paarvatiisham.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాత మాయింట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయిదగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంత సేపు తిప్పినా తిరగలేదు. ఏలాగా అని ఆలోచిస్తూ మరొకమాటు గట్టిగా తిప్పవలెనని ప్రయత్నము చేశాను. చెయిజారి ముందుకు కుళాయిమీద పడ్డాను. అదివరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయి జారి పడడము తోటే జయ్యని నీళ్ళు వచ్చి నావంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడముతోటే ఆగిపోయాయి. ఏమిటీ మాయ అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్ళువస్తయి కదా అని తెలుసుకున్నాను.

దంత ధావనాది కాలకృత్యములు తీర్చుకుని స్టేషనులోకి అమ్మతెచ్చిన నాలుగిడ్లీముక్కలు తిని కాసిని కాఫీ నీళ్ళు తాగి రైలురోడ్డు పక్కనవున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను.

అరవదేశము కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా వుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలూ, పంటభూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగ వుంది. ఇంత తృణ కాష్ఠ జల సమృద్ధిగల దేశస్థులు అంత దరిద్రులుగా వుండి ఎనిమిది రూపాయలకూ, పదిరూపాయలకూ ఆశించి దేశాలుకాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను.

మధ్యాహ్నము ఒక స్టేషన్ లో గార్డువచ్చి భోజనము కావాలా అని అడిగాడు. నా భోజనము సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితేమట్టుకు మనము తింటాము గనుకనా అని 'అక్కర్లేదు' అన్నాను. 'అయితే మరేమి