Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేస్తారు? అన్నాడు. 'సరే ఏదో చేస్తాలే ' అన్నాను. వాడు నా ముఖముకేసి చూసి పెదవి విరిచి కనుబొమలూ బుజాలూ ఎగరవేసి చక్కా పోయినాడు. భోజనముసంగతి ఏమి చేయడానికీ తోచక మళ్ళీ ఏదో కాస్త చిరితిండి కొనుక్కుని కాస్సేపు పడుకుని నిద్రపోయినాను. సాయంత్రము సుమా రైదు గంటలయ్యే సరికి 'ట్యూటికొరిన్ ' చేరాను.