పుట:Baarishhtaru paarvatiisham.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


'సరిగదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెల్సును' అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డు అలా వెడుతున్నాడు. వీళ్ళ నవతలకి గెంటి వెయ్యమని చెపుదామని కేకవేశాను. వాడు నామాట వినిపించుకో కుండా చక్కా పోయాడు.

ఇంతట్లోకే వీళ్ళకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వాళ్ళీసంగతంతా చెప్పారు. నాకింగ్లీషు రాదనుకున్నారు కాబోలు వాళ్ళు, 'వట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకి ఒక రూపాయో, రెండో చేతులో పెట్టినట్టున్నాడు. ఇంక పాపము పెట్టె అంతా తనదే ననుకుంటున్నాడు' అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకు రూపాయ యిచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, 'అనవసరంగా అట్టే మాట్లాడకండి. చెన్నపట్నమంత ఊరు కాకపోయినా నేనూ నర్సాపురంలో చదువుకున్నాను. నేను గార్డుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున సెకండుక్లాసులోకి వస్తున్నారేమో ననుకొని మీ మేలు కోరే చెప్పాను. యీ టిక్కట్లే కొనుక్కున్నట్టయితే ఇందులోకే రావచ్చు. నా అభ్యంతర మేమీ లేదు' అన్నాను దర్జాగా. గార్డు రూపాయి పుచ్చుకుని మోసము చేశాడుగదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచీకూడా ఎందుకనుకున్నాను. పేచీపెట్టినా ఏమీ లాభించేటట్టు కనుపించదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావము కలవాణ్ణికాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తరువాత అసలే పేచీలోకిదిగను. ఒకవేళ పొరబాటున దిగినా, తక్షణము గౌరముగా ఇంగ్లీషు వాళ్ళు యుద్ధములో తమ పని మరోలా గవుతుం దనుకొన్నప్పుడు మర్యా