పుట:Atibalya vivaham.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేరుపురుగువలెనున్న యీ బాల్యవివాహమును రూపుమాపినంగాని మన దేశమునందలి కుటుంబములలో వివాహమువలని సంపూర్ణఫలమెన్నటికిని కలుగనేరదు. ఈ బాల్య వివాహము మనదేశమునం దంతకంతకు ప్రబలుచుండుట కనేక కారణము లగుపడుచున్నవి. కొందఱు తాము బ్రతికియుండఁగానే తమ బిడ్డలకు వివాహము చేసి ముద్దులను ముచ్చటలను వేడుకలను చూడవలెనను నుద్దేశముతో పసిబిడ్డలకు వివాహములు చేయుదురు; మఱికొందఱు బిడ్డలయొక్క పెండ్లిండ్లను తామెప్పుడు చూతుమా యని తొందరపడుచుండెడు వృద్ధులయిన జనకుల యొక్కయు బంధువుల యొక్కయు నిర్బంధముచేత చేయుదురు; కొందఱగవుతగవుల నిమిత్తమును కట్నములు కానుకలు మొదలైన వాని నిమిత్తమును పోరుపెట్టెడు మూఢురాండ్రయిన భార్యలయొక్క ప్రోత్సాహముచేత చేయుదురు; కొందఱు దంభమునకయి యతి వ్యయము చేసి దక్షిణల చేతను బ్రాహ్మణ సంతర్పణముల చేతను ప్రతిష్ట పొందవలె నన్నకోరికతో చేయుదురు; కొందఱు వివాహములో వివాహము చేసిన సొమ్ము కలిసి వచ్చునని చేయుదురు; మరుకొందఱిప్పటియాచారమునుబట్టి తమ బిడ్డల కెంత శీఘ్రముగా వివాహము చేసిన లోకులు తమ్మంత మంచివారనుకొందురని పేరున కాశపడి చేయుదురు; కోడండ్రమీఁద నధికారము చేయవచ్చు నన్న యభిలాషతో నుండెడియిల్లాండ్రయొక్క యభిమతములు తీర్చుట కయి చేయుదురు; కొందఱు మంచి సంబంధముల కాశపడి చేయుదురు; కొందఱు వేగిరము వివాహములు కాక పోయినపక్షమున తమబిడ్డలు చెడిపోదురను సచ్చింతతోనే చేయుదురు; ఇంకను కొందఱు బాల్యవివాహములు చేయకుండుట శాస్త్రవిరుద్ధమన్న భ్రమచేత చేయుదురు. ఈ తెగలవారు గాక స్వప్రయోజనపరులై మానుషధర్మమును విడిచి దయాశూన్యులై రొక్కమును పుచ్చుకొనియో, అల్లుడు చచ్చి