పుట:Atibalya vivaham.pdf/2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేహముగా పరిగణింపఁబడుచుందు రనియు,ఈవివాహబంధము వలననే పురుషుల యావశ్యకములను స్త్రీలును స్త్రీల యావశ్యకములను పురుషులును తీర్చి పరస్పరసుఖాభివృద్థి పొందురు రనియు,మీరందఱు నెఱిఁగియున్న విషయమే గనుక వివాహముయొక్క ప్రాశస్త్యమును గుఱించియు నేనిక్కడ చెప్పవలసిన యావశ్యకము లేదు. అమరణమును వధూవరులకుఁ గలుగ వలసిన సుఖములకుఁగాని వధూవరులయెగ్యతా యెగ్యతలే ప్రధానములై నవనియు, సంసారసుఖము దంపతులయొక్క పరస్పరాలురాగము ననుసరించియే యుండు ననియు,మీకు విశదపడినయంశమే గనుక వివాహకాలమునకుముందే వధూవరులు వివాహబంధమువలనఁడమకు ముందు కలుగఁబోయెడు సంసారభారము యొక్క గౌరవమును తాము ముందెల్లకాలమును కలిసి మెలసి యుండ వలసినవారిగుణాగుణములను తెలిసికో తగినంతప్రాజ్ఞత గలవారుగా నుండవలసిన దన్నయంశమునుసహితము నేను వివరింపపవలసిన యావశ్యకము లేదు.అయినను వివాహము లెవ్వరి సుఖసంతోషాదులనిమిత్త ముద్దేశింపఁబడినవో,వానియందలి లోపమువలన నెవ్వరు కలకాలమును దుఃఖ మనుభవింపవలసినవా రగుదురో,తమచిరకాల సుఖజీవనమున కనుకూలప్రతికూలములుగా నుండుసాధకబాధకముల నాలోచించుకొనుట కెవ్వ రర్హులో, వారియంగీకారమును పరస్ప రేచ్ఛనులేశ మాత్రమును గణింపక మనదేశమునందు కొన్ని వర్ణములవారు వివాహములయం దాస్వాతంత్ర్యము నంతను తామే యక్రమముగా వహించి యాచారబలము చేతను మఱికొన్ని కారణములచేతను యుక్తాయుక్తవిచారమును జేఁయజాలక నిర్దోషు లయినబిడ్డలకు మితిమీఱిన కష్టములను తెచ్చి పెట్టుచుండుట చూడ నెంతయుశోచనీయముగానున్నది. సంసారసుఖకల్పవృక్షమును మూలచ్ఛేదము చేయుటకై