పుట:Atibalya vivaham.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నచో వానిసొ త్తంతయు తమకే వచ్చుననియో, అల్లునియింటఁ జేరి తామందఱును సుఖజీవనము చేయవచ్చుననియో, తాముకన్న నోరెఱుఁగని శిశువులను అప్రయోజకులకును వికలాంగులకును వృద్ధులకును వివాహ వ్యాజమున బలియిత్తురు.ఏ కారణము చేత జరిగెడు బాల్య వివాహముల కైనను పురోహితులును యారకులును తోడుపడ సర్వ విధముల బాల్య వివాహములను ప్రోత్సాహపఱుతురు. ఇటువంటి కార్యములచేతనే ధనము సంపాదించి పొట్ట పోసికోవలసిన స్వప్రయోజనపరులు ప్రోత్సాహము చేయక మఱియేమి చేయుదురు? ఎవరి ప్రోత్సాహముచేత చేసినను, ఏ యుద్దేశముతో చేసినను, ఏ కారణముచేతఁ జేసినను, స్వభావవిరుద్ధ మనఁజను బాల్యవివాహము వలనఁ గలిగెడి దుర్వారము లైన దుష్ఫలములు కలుగక మానవు అతిబాల్య వివాహమువలన సంభవించుచున్న యనర్థములలోఁ గొన్నిటినిమాత్ర మిందు వివరించెదరు. బాలారిష్టములును స్ఫోటకము మొదలగు సాంక్రామిక రోగములును వానివలన కలిగెడు మరణములను బాల్యదశయందే విస్తారముగా నుండునన్న సంగతి యెల్లవారికిని తెలిసినదే. అందుచేత ౧౮౮౦ వ సంవత్సరమునందు మనదేశమునందు చేసిన జనపరిగణనమును బట్టి చూడఁగా తొమ్మిది సంవత్సరములను లోపలి వయస్సుగలిగి వివాహమన్న నేమో యెఱుఁగనిదశలోనున్న బాలురలో భార్యలను పోగొట్టుకొన్నవారు లెక్క తెలిసినంతవఱకు ౨౪౭౭౩ గురు క్నఁబడుచున్నారు. వీరి వివాహ సమయములయందు వ్యయపఱచిన ధనమంతయు వ్యర్థమగుటతప్ప, ఈ బాలురుగాని వారి బంధువులుగాని యేమిలాభము ననుభవించిన వారయినారు? బాలికలగతి బాలురదానికంటెను సహస్రగుణములు దుఖ:బహుళ మయినదిగా నున్నది. పురుషులు మరల వివాహము చేసికొన నైన నర్హులుగా నుందురు గాని నిరపరాధిను లయిన పసిబా