పుట:Atibalya vivaham.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతిబాల్యవివాహము

47

శరీరముతో చేర్చి మీరు ముసలివా రగువరకును గృహమును పరామర్శింపుము ' అనిపలుకుటయు, బాల్య వివాహమున కిసుమంతయయినను పొసగి యుండునా? ఆపస్తంబ, ఆశ్వలాయనాది సూత్రము లన్నియు వధూవరులు మూడుదినము లధశ్శయ్యనుండి బ్రహ్మచర్యము చేయవలెననియు నాలవ దినము రాత్రి గర్భాదానము జరగవలెననియు విధించుచున్నట్టును, గర్భాధానముతోగాని వివాహపూర్తి కానట్టును శాస్త్రజ్నానము కలవారి కందరికిని తెలియునుగదా? ఇప్పుడు జరుగుచున్న శాస్త్ర విరుద్ధ మయిన బాల్య వివాహములలొ వివాహమున కావశ్యకమయిన గర్భాధానమును జరపకపోయినను మన పురోహితులు నాలవనాటిరాత్రి గర్భాధాన మంత్రముల నేకరువు పెట్టుచుండుట నందరు నెరుగుదురుగదా? ప్రాచీనము లయిన మన ధర్మశాస్త్రము లన్నియు యుక్తవయస్సు వచ్చిన స్త్రీలకే వివాహమును విధించు చున్నవి. అందుచేతనే మన ధర్మశాస్త్రకర్తలు వివాహయోగ్యకన్యాప్రాశస్త్యమును చెప్పునప్పుడు "శ్లో||క్న్యాక్షతయోని: స్యాత్కులీనా పిత్రుమాత్రుత: | బ్రహ్మాదిషు వివాహేషు పరిణీతా యధావిధిం || సా ప్రశస్తా వరారోహా శుద్ధయోని: ప్రశస్యవే" అని బ్రాహ్మాది వివాహముల యందు కులీనురాలును పురుషసంభోగ మెరుగనిదియు ప్రశస్తురాలని వృద్ధగౌతముడును,"గృహస్థో వినీతక్రోధహర్షో గురుణానుజ్నాత: స్నాత్వా అసమానార్షా మస్పష్టమైథునాం యవీయసీం సదృశీం భార్యాం నిందేత" అని వరుడు గురువునాజ్న పొంది పురుష సంసర్గ మెరుగని తనకంటె చిన్నదానిని వివాహమాడవలయునని వసిష్టుడును, "శ్లో||అసపిండాచ యామాతు రసగోత్రాచ యా పితు||సాద్విజానాం ప్రశస్తా స్త్రీ దారక్ర్మణ్యమైథునీ" ద్విజాతులలొ మైథున మెరుగని స్త్రీ భార్యగా స్వీకరించుటకు ప్రశస్తురాలని మనువును, బ్రాహ్మ్యదివివాహములయందు పురుష సంభోగము లేని కన్నియలనే