పుట:Atibalya vivaham.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రశస్తురాండ్రనుగాఁ జెప్పియున్నారు రజస్వలలు కానివారికే ద్విజాతులలో వివాహములు జరగవలెనని యీ ఋష్యాదు లుద్దేశించి యండినయెడల,వారుపయోగించిన అక్షతయోని,శుద్ధయోని,అస్పృష్టమైథునా,అను పదములన్నియు వ్యర్థములగును గదా ఇది యిటుండఁగా మనువు మెదలగువారు వ్యక్తురాండైృన స్త్రీలకు వివాహములు విధించియున్నారు."శ్లో త్రీణినవ్షాణ్యపేక్షేత కుమార్యృతుమతీసతీ ఊర్థంతుకాలాదేతస్మాద్విందేత సదృశంపతి అదీయమాన భర్తారమధిగచ్ఛేద్యది స్వయమ్ నైనఃకించిదవాస్నోతి నచయం సాధిగచ్ఛతి"అని కుమారి ఋతుమతి యైనతరువాత మూడు సంవత్సరములు వేచియుండి,తండ్రి వివాహము చేయనియెడల స్వయముగానే వరుని కోరుకోవచ్చు ననియ,ఆప్రకారముగా వరించిన స్త్రీగాని దాని భర్తగానియేవిధ మయిన పాపమును పొందరనియు,మనువు స్పష్టముగాఁ జెప్పియున్నాఁడు."త్రీణి వర్షాణ్యృతుమతీ కాంక్షేత పితృశాసనమ్ తతశ్చతుర్థేవర్షే విందేత సదృశం పతిమ్ ఋతుమతి యైనస్త్రీ మూడు సంవత్సరములు తండ్రి యాజ్ఞకయి వేచియుండి నాల్గువ సంవత్సరమున తగిన భర్తను కోరురోవలసి పదని బోధాయమలు చెప్పియున్నారు .ఋతుత్రయ ముపాస్యైవ కన్యాకుర్యాత్స్వయంవరమ్ అని మూడుఋతువులైన తరువాత కన్య స్వయముగానే వరింపవచ్చునని విష్ణుస్మృతియందును జెప్పఁబడి యున్నది. ఇట్లు అందఱును ఋతుమతి యైన తరువాత వివాహము సంగీకరించుటయేకాక, మంచి వరుఁడు దొరకని పక్షమున నెంతికాలమయినను కన్యను వివాహము లేకయే యుంచవచ్చుననికూడ మన్వాదులు విధించి యున్నారు. "శ్లోః కామమామరణాత్తిష్ఠే ద్లృహేకన్యర్తుమత్యపి! సత్వేవైనాం ప్రయచ్ఛేత గుణహీనాయ కర్హిచిత్" అని కన్య ఋతుమతి యైనను