పుట:Atibalya vivaham.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

అతిబాల్యవివాహము

అంతేకాక వివాహములో నాలవదినమున వధూవరులకు జరిగెడి సంభాషణములో "అపశ్యం త్వా మనసా చేకితావఒ తవసోజాతం తపసో విభుతం : ఇహప్రజా మిహరయిగ్ శరాణ: ప్రజయాస్వప్రజయాపుత్రకామ" అని వరుని గూర్చి వధువు 'నీవు యోగ్యుడ వనియు తపసుచేత పుట్టి తపస్సు చేత వర్ధిల్లితివనియు నేను మనస్సు చేత తెలిసికొంటిని గనుక, నాయందు పుత్రకాముడ వయి యున్న నీవిక సంతోషపూర్వకముగా సంతానము పొందుమనియు "అవశ్యం త్వా మనసాదీధ్యానాగ్ ం స్వాయాం తనూగ్ ం ఋత్వియేనాధమానాం | ఉపమాముచ్వా యవతిర్బభూయా: ప్రజయాత్వ ప్రజయాపుత్రకామే" అని వధువును గూర్చి వరుడు 'నీవీసమయమునందు నాధునితో కూడవలెనని యపేక్షించుచున్నట్టు నా మనస్సు చేత కనిపెట్టితిని గనుక, యువతివయి పుత్రకామురాలవయి యున్న నీవు నన్ను పొంది సంతానము కనుము ' అనియు, మంత్రము చేత చెప్పుదురు. ఇటువంటి సంభాషణము సంభోగము మాట యటుండగా వివాహమనగా నేమో యెరుగని బాలునకును బాలికకును జరిగెడిదని మతిమంతుడెవ్వడయిన చెప్పగలుగునా? వివాహ దినముల లోనే వరుడు వధువును గూర్చి "గ్రుహం గచ్చ గ్రుహపత్నీ యధాసోవశినీ త్వం వివిధ మావా దాసి" అను రుగ్వేదమంత్రముచేత 'నీవు గ్రుహమునకు వచ్చి గ్రుహయజమానురాల వయి యింటికి వచ్చిన వారి నాదరించి గ్రుహక్రుత్యములను నిర్వహింపుమని " పలుకుటయు, వధువును గూర్చి బ్రాహ్మణులు "ఇహంప్రియం ప్రజయాతే సంరుధ్యతాస్మిన్ గ్రుహేగార్హపత్యా యజాగ్రుహి| ఏనాపత్యాతన్యగ్ సంస్రుజస్వాధాజ వ్రీవిదధమావదాధ:" అను ఋగ్వేదవచనముచేత 'ఇప్పుడు ప్రియపడి నీ వీ గ్రుహమునందు సంతానమును పొంది గ్రుహ యజమానత్వము నందు జాగరూకురాల వయి, నీశరీరమును నీపతి