పుట:Atibalya vivaham.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాఖ్యానము చేయుచు విజ్నానేశ్వయోగి "స్త్రియప్సర్వత్ర స్పర్శనాలింగనాదిషు శుద్ధా:" అని వ్రాసియున్నాడు. కాబట్టి స్త్రీలు వివాహకాలమునకు సంపూర్ణావయవములు కలవారయి యీడేరి వాక్ప్రౌఢిమకలవారయి యుండవలెనని యేర్పడుచున్నది. శ్రుతిస్మ తులయందీప్రకారముగా నుండగా బాల్య వివాహములను వ్యాపింప జేసిన వారు జ్యోతిర్నిబంధమను గ్రంథములొని దని "శ్లో||షడబ్దమధ్యేనోద్వాహ్యా క్న్యా వర్ష ద్వయన్యత | సోమోభుజ్తే తత స్తద్వద్గంధర్వశ్చ తధానల:||"అని స్త్రీ కారేండ్లలోపల వివాహము చేయ గూడదనియు, సోమగంధర్వసావకులు రెండేసి సంవత్సరములనుభవింతురనియు వ్రాసి, సోమాదు లనుభవించుకాల మారేండ్లలోనే పోవుననియు నేడవయేడు మొదలుకొనియే కన్నియ వివాహయోగ్యురాలనియు బోధపడునట్లు చేసియున్నారు. కాని సోమాదులు కన్నియను పసితనములోనే వరించి శౌచాదుల నిత్తురనుట యుక్తికిని శాస్త్రమునకును కూడ విరుద్ధము. గంధర్వుని నుద్వాహము చేయునప్పుడు వివాహములో పథించెడు ఋగ్వేదమంత్రముతోనే "ఉదీర్ష్వాతోంవిశ్వావసో నమసేదా మహేత్వా | అన్యామిచ్చ ప్రభర్వ్యగ్ ం సతే భాగో జనుషాతస్యవిద్ది"" అని గంధర్వుడయిన విశ్వావసుడు వివాహిత యయిన యా స్త్రీని విడిచిపెట్టి వ్యక్తురాలు కాని పిత్రుగ్రుహముననున్న యవివాహితకన్య యొద్దకు పోవ ప్రార్థింపబడుచున్నాడు. ఇట్టి బలవత్తరమయిన శ్రుతి ప్రమాణముండగా నిర్ణయ సింధ్వునం దుదాయరింపబడిన పయివచనమునుబట్టి కన్నియకు నాలవయేటనే స్తనోద్గమము కలుగుననికాని, యేడవయేటనే వివాహము చేయవలెనని కాని, వివేకులెవ్వరయిన చెప్పసాహసింపగలరా?