పుట:Atibalya vivaham.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్చాదాద్గ్ని ర్మహ్యమధో ఇమాం " అను ౠగ్వేద వచన్మునుబట్టికన్నియను మొదట సోముడు వరించుననియి, తరువాత గంధర్వుడు వరించుననియు, అటుపిమ్మట నగ్ని వరించుననియు, ఆ పయిని మనుష్య్డు వరించుననియు, కన్నియను సోమాదులొకరి తరువాత నొకరికియ్యగా కడపట మనుష్యునకు వచ్చుననియు, శాస్త్రమర్యాద యున్నది. కన్నియను పురుషుడు వివాహమాడుటకు ముందు సోమాది దేవతలు వరించవలసిన పక్షమున, అసోమాదులు వరించెడికాలమేది, అటుతరువాత మనుష్యుడు పొందవలసిన కాలమేది, అని తెలిసికోవలసియుండును. దీనికాధారముగా సంవర్తస్మృతియందు 'శ్లో||రోమదర్సన సంప్రాప్తే సోమో భుక్తేధ కన్యకా| రజోదృష్ట్వాతుగంధర్వ కుచౌదృష్ట్వాతుసానక||" అని యధోరోమదర్శన కాలమందు పాపకుడును వరింతురనియు, అటుపిమ్మట ననగాకన్నియయుక్తవయస్సు వచ్చి రజస్వలమయి కుచపరిపూర్తి యయిన పిమ్మట నేపురుషుడు వివాహమాడవలయుననియు, ప్రమాణవచనము కనబడుచున్నది. దీనిని బట్టి చూడగా నీడేరనివార్ని వివాహ మాడకూడదనియేకదా స్పష్టమగుచున్నది. రోమదర్శనాది కాలములయందు సోమాదులు వరింతు రనగా వారా కాలములయందు వరుసగా శరీర శుచిత్వమును, వాక్చాతుర్యమును, పరిశుద్ధతను కలుగజేయుదురని తాత్పర్యమే కాని వారు నిజముగా వరింతురనియే యర్థముకాదు. అందుచేతనే యాజ్నవల్క్యస్మృతియందు "శ్లో|| సోమశ్శౌచం దదౌ స్త్రీణాం గంధ్ర్వశ్చ శుభాంగిరం | పొవకస్సర్వమేధ్యత్వం మేధ్యావైయోషితో హ్యత:|" అని స్త్రీలకు సోముడు శౌచమునిచ్చుననియు, గంధర్వుడు మంచి పలుకులనిచ్చుననియు, పావకుడు సర్వపరిశుద్ధతలనిచ్చు ననియు కంఠోక్తిగా జెప్పబడియున్నది. ఈ శ్లోకములొని కడపటి చరణమునకు