పుట:Atibalya vivaham.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మను భయముచేతనా తా మయుక్తమని యెరిగినదియు తాము ప్రేమించెడివారికి నష్ట కరమయినదియు నైన యకార్యమును చేయవలసినది! తమ కడుపున పుట్టినవారి సౌఖ్యాభివృ ద్ధితో చేరిన యీ విషయమునందే స్వాతంత్ర్యము లేకపొయినయెడల మరియేవిషయము నందు గలుగును? కారణము లేని విషయములలో న్యాయము కాని పట్టుపట్టి కాటికి కాళ్ళుచాచుకొని యున్న వృద్ధు లయినజననీజనకుల మనస్సును నొప్పింపలేనంత దయార్ద్ర హృదయముగలవారు, కలకాలము సుఖముగా బ్రతుకవలె నని కొండంత యాశ పెట్టుకొని దయనీయలయి తమకడుపునపుట్టిన ముక్కుపచ్చలారాని ముద్దుకూతులను వేగరపడి స్వయంకృతాపరాధమువలన యావజ్జీవమును దు:ఖములపాలు చేయగలరా? ఈ రీతి సాకుల్ను విడిచిపెట్టి మనలోని చదువుకొన్నవారు తాము మంచి కార్యమని దృఢముగా నమ్మిన దానిని పామరులకు భయపడక నిశ్శంకముగా నిప్పుడు చేయనారంభింతురో, అప్పుడే మనదేశము బాగుపడ నారంభించునుగాని క్రియ లేని శూన్యవచనములచృత నెప్పుడును బాగుపడదు. "చదువవేసిన నున్న మతియుచెడిన" దన్నట్టు మనదేశమున చదువు హెచ్చుటతోనే బాల్యవివాహములును హెచ్చుచున్నవి. పూర్వకాలమునందు బ్రాహ్మణులు కానివారు కన్నులు తెరవని పసికూనలకు వివాహము చేయుచుండుట సాధారణముగా లేదు. ఈ కాలమున మూడేండ్లకు ముండమోసిన బాలికలు గూడ శూద్రులలో కనబడుచున్నారు. ఇప్పుడు నష్టకరములని యెంచి బ్రహ్మణులు తమ యాచారములును కొంచెమయినను విచారింపక శూద్రులు మొదలైనవారు కొందరు బ్రాహ్మణు లాచరించినట్టు తా మాచరించినచో తమకు గౌరవము వచ్చునని యెంచుకొని యనాలోచితముగా బ్రాహ్మణుల దురాచార