పుట:Atibalya vivaham.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

ఆతిబాల్యవివాహము

న్నను, ఇప్పుడంతకంతకు ప్రబల మగుచున్నవి. నాచిన్నతనములో ఏడెనిమిది సంవత్సరములకు లోపు వయస్సుగలబాలికలకు వివాహము చేయుట ఎక్కడనో యరుదుగానుండుచు వచ్చెను. ఇప్పుడు పాలువిడువని బాలికలకుసహితము వివాహములు చేయుట సర్వసామాన్యమగుచున్నది. ఈదురాచార మెుక్క పామరులలో మాత్రమే కాక చదువుకొన్నవారిలో కూడ వ్యాపించున్నది.ఇక్కడ విద్యాశాలయందు సర్వకలశాల పరీక్షకు చదువుకొనుచు బహుధైర్యముతో బాల్యవివాహము లనర్థదాయకములని వాదించుచువచ్చిననా మిత్రుఁడే యెుకఁడు తనవంతు వచ్చినప్పుడు కొమార్తె కు నాలుగుసంవత్సరముల యీడు వచ్చులోపలనే వివాహము చేయఁగా చూచి యున్నాను. చదువుకొన్న వారికిని చదువుకొననివారికిని మాటలయందు తప్ప కార్యములయం దంతగా భెేద మగపడుచుండ లేదు. ఈనడుమను చెన్నపురమునందు జరిగన మహాసభలో సర్వకలాాపరీక్షలం దేఱి పట్టపరీక్ష నిచ్చి మెప్పించినంత మహా విద్యావంతులు కూడా తమ కొమార్తెలకు పదిసంవత్సరములకు లోపల వివాహము చేయకుండటకు బద్ధుల మయ్యెదమని వాగ్దానము చేయలేకపోయిరి. వారందుకు కనఁబఱిచిన హేతుబలమును కొంచెము చిత్తగింపుఁడు. ఈకొమార్తె లను గన్నతండ్రులు తామే తల్లిదండ్రులచాటు బిడ్డలఁట!స్వాతంత్ర్యము లేనివారట: ఆహా! లోకములో నింతకంటె బానిసతనమేమున్నది? వివాహ విషయమయిన సాధక బాధకముల నాలోచించుకొను స్వాతంత్ర్యము వివాహసంబంధము వలని సుఖదు:ఖములను యావజ్జీవమును అనుభవింప వలసిన వధూవరులకును లేక, వారి తల్లిదండ్రులకును లేక, అంతలపొంతలవారికా యుండవలసినది? పట్టపరీక్షలము గ్రుతార్థులైనవారు తాము స్వతంత్రముగా పొట్టపోసికోలే