పుట:Atibalya vivaham.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

అతిబాల్యవివాహము

ములను కొన్నిటి నవలంబించుచున్నారు. ఆందుచేత పూర్వకాలమునందు బ్రాహ్మణ వైశ్యజాతులలో మాత్రమే యున్న బాల్యవివాహము లిప్పుడు సర్వవర్ణ సామాన్యములయి శూద్రులలొ కూడ వెలయు చున్నవి. శూద్రులు చేయనారంభించిన పనినే తామును చేయుచున్నచో తమకు గౌరవాధిక్యము లేదనుకొని యాలోచనలేని బ్రాహ్మణోత్తములు తా మేలాగున నయినను వారిని మించవలెనని యొకరు ప్రయత్నించుచుండుటచేత కడపట నందరును చెడుచున్నారు. అందుచేత నీ వివాహములు క్రమక్రమముగా వివేకులకు బరిహాసపాత్రములయి, పెండ్లిపీటమీద పెండ్లి కొడుకు తల్లిని గానక యేడుచుటయు, పెండ్లికూతురు పాలకై యేడుచుటయు, వారి యేడుపుడుపుటకయి కొన్ని సమయములందు బెత్తము చేత బట్టుకొని యయ్యవారును మరికొన్ని సమయములందు పప్పు బెల్లములును కావలసివచ్చుటయు, భార్య యెవ్వరో తెలియక పిల్ల నొడిలో బెట్టుకొని చన్ను గుడుపుచున్న తల్లి మెడకే పెండ్లికొడుకు మంగళసూత్రధారణము చేయుటయు, పోరుపెట్టిన పెండ్లికొడుకుచేత పుస్తె కట్టించుటకు చేత గాక పురోహితుడే పెండ్లికొమార్తెకు తాళిబొట్టు కట్టి వివాహతంత్రము నడుపుటయు, దటస్థించుచున్నది. మూడము లనియు, చెప్పి యనుగ్రహించెడి జ్యోతిష్కులముహూర్తములు కూడ బాల్యవివాహములను త్వరపెట్టుచున్నవి. ఈజ్యోతిషముచేత జనులు మోహపడి జాతకపత్రిక బాగుండ దను హేతువుచేత కులములో దొరక తగిన వారిలో కూడ మంచిమంచి వరులను నిరాకరించి యథములను స్వీకరించుచున్నారు. ఇందుచేత కూడ బహుదాంపత్యములు సుఖదాయకములు కాకున్నవి. ఈ ముహూర్తములవలన జ్యౌతిషమునే వృత్తిగా నేర్పరచుకొన్న వారి కుటుంబపోషణము జరుగుచుండుట తప్ప నాకు