Jump to content

పుట:AntuVyadhulu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్షణశక్తి

77


రెండవరకము వ్యాధులలో అనగా సూక్ష్మజీవుల విషయములచే మన కపకారము కలుగు వ్యాధులలో రక్షణశక్తి గలిగింపవలెననిన నీ విషములను విరిచివేయు పదార్థములను కనిపెట్టవలెను. ఇట్టి పదార్థములకు సూక్ష్మజీవ విషనాశకములనిపేరు. ధనుర్వాయువను వ్యాధి మిక్కిలి భయంకరమైనది. వ్యాధి అంకురించిన కొద్దికాలములోనే దవడలు దగ్గరగా నొక్కుకొనిపోయి, నడుము విలువంపుగా ముందుకు వంగి కొయ్యబారి రోగి యతిఘోరమగు బాధనొంది మృతిచెందును. [1] అట్టి స్థితిలోకూడ ధనుర్వాయు సూక్ష్మజీవ విషనాశకములగు పదార్థమును రోగియొక్క శరీరములోనికి సన్నని బోలు సూదితో నెక్కించినయెడల నిమిషములమీద రోగికి స్వస్థత కలుగును.

ఈ పదార్థము గుర్రము నెత్తురునుండి ఈ క్రింది ప్రకారము చేయబడినది. ఒక గుర్రముయొక్క శరీరములోనికి ఆ


  1. ఈ మధ్య కొన్నిదినముల క్రిందట బెంగళూరువద్దనున్న కుప్పం అను గ్రామములో నొక ఆమెకు కాలిపై ద్వారబంధముమీదనుండి మట్టిగడ్డపడి, కాలిలో గాయమై ఆ గాయముగుండ కొంతమట్టి లోపలకుపోయి, పైని మూసికొనిపోయెను. ఈ మట్టితో గూడ ధనుర్వాయు సూక్ష్మజీవులు గాయములో ప్రవేశించెను. రెండుదినములు గడచిన పిమ్మట యొక నాటి సాయంకాలము ఆమెకు దవడలు దగ్గరపడిపోయి, శరీరము కొయ్యవలెనయి నిశ్చేష్ఠురాలయ్యెను. వెంటనే వారు నాకు తంతిపంపగా ఇక్కడనుండి నేనుధనుర్వాయు సూక్ష్మజీవివిష నాశకమగుద్రవమును(Titanus Antitoxic Serum) తీసికొని వెళ్లి బోలుసూదిగుండ దండలోని చర్మముక్రింద నెక్కింపగా వెంటనే నెమ్మతించెను.