పుట:AntuVyadhulu.djvu/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవు లెవరికంటును

69



పెంపువంటిది. ప్రతిదినము సాయంకాలమునకు మల్లెపూవు లెట్లు పూచి విజృంభించి మరునాటికి వాడిపోవునో అట్లే సూక్ష్మజీవులను ఒకానొక కాలమందు వృద్ధినొంది తమ ఆయుర్థాయపుమితి మీరినతోడనే పెంపు తగ్గియుండును. కావున ఆటలమ్మ, పొంగు, మశూచకము, కలరా మొదలగు అంటువ్యాధులు ఏమియు రోగములేనివానియందు అకస్మాత్తుగ కనుపడి దిగిపోవునప్పుడుకూడ నొక్క పెట్టున దిగిపోవును. అనగా అట్లు దిగిపోవునాటికి సూక్ష్మజీవులపొగరు అణగిపోవు ననిగాని, లేక సూక్ష్మజీవులవలన తయారుచేయబడు విషముల శక్తి విరిగిపోయినదనిగాని తెలియుచున్నది. ఒక్కొక్కజాతి సూక్ష్మజీవి ఎట్లుపెరుగుచు చచ్చుచుండునో అట్లే వానివలన కలుగు వ్యాధులయొక్క స్వరూపములును నిరూపింపబడు చుండును.

సూక్ష్మజీవు లెవరికంటును

ప్రతిసూక్ష్మజీవియు ఒక్కొక జాతిజంతువున కొక్కవిధముగను, ప్రజలలలోకూడ యొక్కొకదేశపు ప్రజలకొక్కొక విధముగను అంటును. అన్నిజంతువులకును అన్నిజాతుల ప్రజలకును ఒక టేరీతిగ నీవ్యాధు లంటవు. మానవుల కంటినట్లు సూక్ష్మజీవు లితరజంతువుల కంటవు. ఏవో కొన్ని జంతువులేకాని తక్కిన జంతువులు సూక్ష్మజీవులకు లెక్కచేయవు. పశువులకు, కోళ్లకు, పందులకువచ్చు అనేక వ్యాధులు మను