Jump to content

పుట:AntuVyadhulu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ఏడవ ప్రకరణము


ష్యుల కంటుటలేదు. మనుష్యులకంటు పచ్చసెగ, ఆటలమ్మ మొదలగు వ్యాధులు పశువుల కంటుట కానరాదు. ఒకటే కుటుంబములోచేరిన రెండు తెగల జంతువులకుగూడ సూక్ష్మ జీవులొక్కరీతిగ అంటుటలేదు. పొలముచుంచులు అధికముగ క్షయవ్యాధితో చచ్చును. కాని యింటిచుంచులకు క్షయ వ్యాధిరాదు. కొన్నిదేశములలో గొర్రెలకు దొమ్మవ్యాధి మిక్కుటముగ వచ్చును. మరికొన్ని దేశములలో నీ గొర్రెలకా దొమ్మవ్యాధి అంటనే అంటదు. మానవులలో గూడ ఈ భేదము స్పష్టముగ కానవచ్చుచున్నది. ఆఫ్రికాదేశము నందలి నీగ్రోలను నల్లవారలకు చలిజ్వర మంతగారాదు. అక్కడ నున్న తెల్లవారల నిది మిక్కిలి యధికముగా బాధించును. కాని యీ నీగ్రోలు క్షయవ్యాధిచేతను, మశూచకముచేతను, తెల్లవారలకంటె మిక్కిలి సులభముగ మృతి జెందుదురు.

కడు మన్యప్రదేశములలో రేయింబగళ్లు నివసించుచున్నను కోయవాండ్రకు సాధారణముగ చలిజ్వరముఅంటదు. బయటిప్రదేశములనుండి పోవువా రచ్చట నొక్కదినము నివసించినను వారి కీ చలిజ్వరము వెంటనే యంటుకొనును.

ఒక్కటే జాతిలోకూడ సూక్ష్మజీవు లందఱకు నొక్క రీతిగా నంటవు. టీకాలు వేసినప్పుడు కొందరికి బాగుగ పొక్కుటయు కొందరికి బొత్తుగ పొక్కక పోవుటయు అందరకు