పుట:AntuVyadhulu.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

సూక్ష్మజీవులెట్లు వ్యాధిని కలుగజేయును ?

సూక్ష్మజీవులు గాయముగుండ గాని, నోరు ముక్కు మొదలగు మార్గములగుండగాని యేదో యొక విధమున మన శరీరమున ప్రవేశిచునని పైని చెప్పియుంటిమి. ఇవి ప్రవేశించినతోడనే మన రక్తమునదుండు తెల్లకణములకును వీనికిని యుద్ధము ప్రారంభమగును. మనకొక చిన్నకురుపు లేచినప్పుడు మన శరీరమునందు జరుగు పోరాట మీ ప్రక్కపటము నందు చూపబడినది. 25-వ పటమును జూడుము. ఇందు తెల్లకణములనుచూడుము. యివియెల్ల ప్పుడు సిద్ధముగనుండి వెనుదీయక తాము చచ్చువరకును పోరాడుమనభటులని చెప్పవచ్చును. ఇందు కొన్ని సూక్ష్మజీవులనుమ్రింగి నశింపజేయును. కొన్ని సూక్ష్మజీవులను నశింపజేయు విషపదార్థములను పుట్టించును. మరికొన్ని ఈ సూక్ష్మజీవులను యుద్ధరంగమునుండి మోసికొనిపోయి ఖయిదీలుగబట్టి యుంచును. కొన్ని సూక్ష్మజీవుల విషములకు విరుగుడుపదార్థములను పుట్టించును. ఇంకను కొన్ని ఆ యా స్థలములనుండెడి యితర భటులకు ఆహారమును దెచ్చి యిచ్చును. యుద్ధము ప్రారంభమయినతోడనే సూక్ష్మజీవుల యుద్రేకమునుబట్టి తెల్లకణముల క్రొత్తపటాలములు నిమిష నిమషము