Jump to content

పుట:AntuVyadhulu.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరాన్నభుక్కులు

63


ఇవి రాత్రులయందు రక్తములో తిరుగుచుండును. వీనిమూలమున అప్పుడప్పుడు జ్వరమును, ఏనుగు కాలువలే వాపును కలుగును. ఇట్టివాపుకాళ్లు, చేతులు, చన్నులు, స్త్రీ పురుషాంగములు వీనిలో నెక్కడయిన గలుగ వచ్చును. ఈ పిల్లలు దోమలు త్రాగురక్తముతో వాని కడుపులోనికి పోయి, అక్కడ పెరిగి పెద్దవై తిరిగి దోమకాటు మూలమునగాని, దోమలు చచ్చిపడియున్న నీటిని త్రాగుటవలన గాని క్రొత్త వారల నెత్తురులో జేరును.