ఈ పుట ఆమోదించబడ్డది
| శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం | శీర్షిక పాఠ్యం |
|---|---|---|---|
| 12 | కుక్క కాటు | బహుశ కొన్ని వారములు లేక నెలలు. | వ్యాధి కుదురువరకు |
| 13 | క్షయ | నిశ్చయముగా తెలియదు | వ్యాధి కుదురువరకు లేక యావజ్జీవము. |
| 14 | కఫ జ్వరము (Pneumonia) | డిటో | కఫము వచ్చుచున్నంత కాలము. |
| 15 | సంధియెత్తి మెడ నడుము కొయ్యబారిపోవు ఒక విధమైన జ్వరము (Cerebro-spinal fever) | 7 మొదలు 14 దినములు. | |
| 16 | తామర (Ring-worm) | 8 దినముల లోపల. | పూర్తిగ పోయిన తరువాత 28 దినముల వరకు. |
| 17 | గజ్జి (Itch) | 8 దినములు | 6 వారములు |
| 18 | తిమ్మిరివాయువు (సంజు-Beri-beri) | నాలుగు వారములు | |
| 19 | డిప్తిరియా (Diphtheria) గొంతుకలో పుండుపుట్టి చంపువ్యాధి | 1 మొదలు 4 దినములు | వ్యాధి కుదిరిన తరువాత 3 వారములు. |
| 20 | బూదకాలు (Elephantiasis) | నిశ్చయముగా తెలియదు. | యావజ్జీవము జ్వరము వచ్చు దినములు. |
పై పట్టీలయందలి గజ్జిని బూదకాలును వ్యాపింపజేయు పురుగులు సూక్ష్మజీవులు కావు. పరాన్నభుక్కులు (Parasites) అను మరియొక తెగలోనివి. 22, 23, 24-వ పటములను జూడుము.