ఈ పుట ఆమోదించబడ్డది
పైన చెప్పినవిగాక మరికొన్ని అంటువ్యాధుల యొక్క అంతర్గతకాలమును రోగిని బహిష్కరింపవలసిన దినముల సంఖ్యను నీ క్రింద వ్రాసియున్నాము.
| వ్యాధి పేరు | అంతర్గతకాలము | రోగిని బహిష్కరింపవలసిన కాలము | |
|---|---|---|---|
| 1 | కలరా | 1 మొదలు 4 దినములు లోపల | పది దినముల వరకు |
| 2 | చలిజ్వరము | 1 లేక 2 వారములు. అంతకు పైన కూడ నుండవచ్చును | జ్వరము బొత్తిగ రాకుండు వరకు |
| 3 | సెగ (Gonorrhoea) | 2 లేక 3 రోజులు | చీము తగ్గిన తరువాత 6 వారములు. |
| 4 | ఇన్‌ఫ్లూయెన్‌జా (Influenza) | 1 లేక 3 రోజులు | 14 దినముల వరకు. |
| 5 | ప్లేగు | 1 మొదలు 7 రోజులు | 21 దినముల వరకు. |
| 6 | కల్లవాపు (Glanders) | 3 మొదలు 18 రోజుల వరకు | పశువ్యాధి. 14 దినముల వరకు |
| 7 | దొమ్మ (Anthrax) | 2 మొదలు 3 రోజులు | పశువ్యాధి. డిటో. |
| 8 | సర్పి లేక దద్దుర (Erysipelas) | 1 మొదలు 2 రోజులు | 7 దినముల వరకు |
| 9 | ధనుర్వాయువు (Tetanus) | 2 దినములు మొదలు 24 దినముల లోపల | ... ... |
| 10 | సూతిక జ్వరము (Peurperal fever) | 1 మొదలు 5 రోజులు | ... ... |
| 11 | కొరుకు (Syphilis) | 40 రోజులు అంతకన్న ఎక్కువ | రెండు సంవత్సరములు |