Jump to content

పుట:AntuVyadhulu.djvu/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

అర అంగుళము పొడగు గల తెల్లని గొట్ట మొకటి ఈ రంధ్రము గుండ బయటకు వచ్చును. పిమ్మట ఈ చిన్న గొట్టము పగిలి దీనిలో నుండు పదార్థము పుండు మీద పడును. మనము చన్నీళ్లను పుండు మీద పోసినప్పుడు బయటకు వచ్చుచిన్న గొట్టము నారి పురుగు యొక్క గర్భతిత్తి యందలి భాగమే. ఇట్లు పుండులో నుండి బయట పడు ద్రవ పదార్థమును కొంచె మెత్తి సూక్ష్మ దర్శిని తో పరీక్షించిన యెడల దీనియదార్థము తెలియగలదు. సూక్ష్మ దర్శినిలో నారి పురుగు పిల్లలు గిలగిల కొట్టుకొను కిక్కిరిసి యున్నవి కనబడును. ఈ ప్రకారము అప్పుడప్పుడు ఈ గ్రుడ్లు బయలు పడుచు 15 దినముల నాటికి గర్భ తిత్తిలో నుండు గ్రుడ్లన్నియు వెలుపలు వచ్చి వేయును. ఇంతట తల్లి నారి పురుగు తనంటట గానే ఒకానొకప్పుడు అకస్మాత్తుగను మరి యొకప్పుడు మెల్లమెల్లగను మానవ శరీరమును విడిచి వేయును. దినమునకు 5, 6 సార్లు కొంచెము కొంచెముగ మెల్ల మెల్లగ తెగి పోకుండ లాగుచు వచ్చిన యెడల కొన్ని పురుగులు ఒకటి రెండు దినములలోనే బయట పడును.

నారి పురుగునకు చల్లని నీటి యందు ఆశ మెండు. అందు చేతనే ఇది సాధారణముగా కాళ్ళలోనికి దిగును. ఏలయన నడుచు నప్పుడును, కాళ్ళు కడుగు కొను నప్పుడును అక్కడ నీళ్లు దొరుకునని దానికి తెలియును. నీటి సహాయము లేని యడల తమ గ్రుడ్లు బ్రతుక లేవని కూడ దానికి తెలియును. అందు చేతనే చన్నీళ్లు దొరికిన తోడనే ఇది గ్రుడ్లను విడిచి పెట్టుటకు సిద్ధ