పుట:AntuVyadhulu.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

237

గాని తడి మట్టిలో గాని అనేక దినముల వరకు నివసింపగలవు. నారి కురుపు వ్యాపకముగల గ్రామములలో నుండు చెరువులలోను, నూతులలోను, ఈ పురుగు పిల్లలు సామాన్యముగ కాన వచ్చును. ఇవి పొడి నేలలో కూడ 6 గంటలు మొదలు 24 గంటల వరకు బ్రతుక గలవు. ఇవి మన శరీరములో ప్రవేశించినది మొదలు బయట కురుపుగా తేలు వరకు మూడు లేక ఆరు మాసములు పట్టును.

తల్లి నారి పురుగు యుక్త వయస్సు వచ్చిన వెంటనే తలతో దారిని దొలుచు కొనుచు సామాన్యముగా క్రింది భాగమునకు అనగా పాదము లోనికి గాని చీల మండ లోనికి గాని కాలి లోనికి గాని దిగును. ఇక్కడ చర్మములో నెక్కడ కైనను ఒక రంద్రమును లోపల నుండి తొలుచు కొనుచు వచ్చి మన శరీరముపై నుండు ఒక్క పలుచని పొరను మాత్రము చీల్చకుండ పై కప్పుగా బెట్టుకొనును. ఈ పొర లోపల నొక బొబ్బ ఏర్పడి అది కొద్ది దినములలో పగిలి పుండగును. ఈ పుండు యొక్క మధ్య భాగమున మిక్కిలి సన్నని రంధ్రమొక్కటి కనపట్టును. ఒకా నొకప్పుడు ఈ రంధ్రము గుండ చొరచు కొని నారి పురుగు యొక్క తల కూడ కొద్దిగ కనపడు చుండ వచ్చును. తల బయటకు కనపడు చుండినను, లేక పోయినను ఈ పుండు మీద కొంచెము చల్లని నీటిని పోసిన యెడల ఒక విధమైన తెల్లని ద్రవ పదార్థము చిన్న రంధ్రము గుండ ఊరునట్లు బయటకు పొంగును. ఒకానొకప్పుడు రమారమి