పుట:AntuVyadhulu.djvu/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

డును. ఈ తుండపు కొన యందు 21 పెద్దవియు 6 చిన్నవియు మొటిమ లుండును. శరీరము పొడుగునను సన్నని అడ్డు గీట్లుండును. ఈ పురుగు రబ్బరు వలె సాగు నట్టి స్వభావము గలదై వింటి నారి వలె నుండుట చే కాబోలు దీనికి నారి పురుగు అని పేరు వచ్చి యుండ వచ్చును. (నారి = విల్లునకు కట్టు త్రాడు). చర్మమునందు ఒక దాని మీద ఒకటి చొప్పున 6 పొరలు గలిగి సూక్ష్మ నిర్మాణమునందిది సామాన్యముగ ఏలుగు పామును బోలి యుండునని చెప్పవచ్చును. దీని తోక వద్ద నుండు భాగము తల వెంట్రుకంత సన్నముగ నుండి కొన యందు కొక్కెము వలె వంగి యుండును. పై పటమును చూడుము. దీని ఆహార కోశము నీటి నుండి తోక వరకు ఒకటే గొట్టముగ నుండును. గర్బ వతి అయినపుడు మిక్కిలి పెద్దది యై లోపల నుండి ఎత్తి కొని వచ్చు గర్భ కోశము చేత పురుగు చిన్నదిగ నుండు నపుడు తెరచి యుండు ఆసన మార్గము మూసికొని పోవును. దీని గర్భ కోశములో నుండు పిల్లలు ఎట్లు క్రిక్కిరిసి యుండునో పటములో చూడ నగును. తల నుండి తోక వరకు వ్వాపించి యుండు దీని గర్భ కోశములో లక్షల కొలది పిల్లలు చుట్టలు చుట్టుకొని యుండును. ఈ పిల్లలు అంగుళములో 1000 వంతు పొడుగను, పొడుగులో రమారమి 20 వ వంతు లావును కలిగి కొంచెము బల్లపరుపుగ నుండును. ఈ పిల్లల తోకలు మిక్కిలి సన్నమై మొత్తము పొడుగులో సగము వరకు నుండును. ఇవి మిక్కిలి చురుకుగ ఈదుచు మురికి నీటిలో