పుట:AntuVyadhulu.djvu/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

239

ముగా నుండును. నీళ్ల బిందెలను భుజముల మీద మోయు వార్ల శరీరములో ఒకానొకప్పుడీ నారి కురుపు భుజముల వద్ద పయికి తేల వచ్చును. కాని ఇతర స్థలములలో ఇది బయట పడుట మిక్కిలి అరుదు.

ఈ వ్యాధి పిల్లలను పెద్ద వారలను అన్ని జాతుల వారలను నారి పురుగున కనుకూలమగు స్థితి గతులేర్పడినప్పుడు సమానముగ నంటును. అనగా ఒక చెరువు లోని నీటి యందు ఈ వ్వాధి వ్వాపించుటకు తగిన కారణముండిన యెడల ఆనీటిని త్రాగు అన్ని జాతుల వారికిని భాగ్య వందులకును బీద వారలకును పెద్దలకును పిల్లలకును వాని కురుపు ఒకటే రీతిగ అంటును. ఈ పురుగు బయటికి రాక పూర్వము కొందరికి దద్దులు, వాంతులు, దురదలు మొదలగు గుణములు కలుగ వచ్చును. పిమ్మట కొన్ని దినములకు శరీరములో ఎక్కడో ఒక్క చోట చర్మము క్రింద నొక్క త్రాడు ఉన్నట్లుగా తోచ వచ్చును. సామాన్యముగా చర్మము క్రిందికి ఈ పురుగు చేరు వరకును ఇది మన శరీరములో నున్నట్లు మనకు తెలియనే తెలియదు. ఇది సాధారణముగా కాళ్ల లోనికి దిగునని వైన చెప్పియుంటిమి కాని నడుము మీదను జననేంద్రియముల మీదను చేతుల మీదను నాలుక మీదను కను రెప్పల మీదను కూడ నీ పురుగు కాన వచ్చు చున్నది. ఒకా నొకప్పుడు ఒకటి గాని అనేకములు గాని కురుపులు పొడుగున ఈ పురుగున్నంత దూరము