223
(ఉ) తార్పు కత్తెలకును, వ్యభిచారమును రహస్యముగ ప్రోత్సాహ పరచు వారలకును కఠిన శిక్షలు విధించు చుండిరి.
(ఋ) వ్యభిచార స్త్రీలు అన్ని వీధులలో విచ్చల విడిగా తిరుగ కుండ నిర్భంధము లేర్పరచి వీరు నివశించుటకు పట్టణములందలి కొన్ని మారు మూల వీధులను నిరూపించి ఆయా వీధులం యందు తప్ప ఇతర చోట్ల వారి యాటలు సాగకుండ జాగ్రత్త్త పడు చుండిరి. నాటకముల లోనూ, సభలలోను ఉన్నత తరగతుల వారితో వీరు కూర్చుండరాదని నిర్బందించిరి.
ఇట్టి నిర్బంధములు హెచ్చుగ పెట్టుచు వచ్చిన కొలదిని రహస్యముగ వ్వభిచారుము హెచ్చగుచుండెను. విచ్చల విడిగ సంచ రింప వచ్చిన చోట్ల బహిరంగముగనే హెచ్చు చుండెను.
విద్య యొక్క అభివృద్ధిని బట్టి వ్యభిచారము తగ్గ వలసి యున్నది. కాని మిక్కిలి ఐశ్వర్యము ననుభవించు ఐరోపా ఖండమునందు అనేక దేశములలో కూడ వ్యభిచారము హెచ్చగు చుండుట శోచనీయము. ఇది యిట్లుండ మన దేశమునందు మిక్కిలి పూజనీయములగు దేవస్థలములలోను వివాహమహోత్సవములలోను సయితము వ్యభిచరించు స్త్రీలను గౌరవింప కుండ మనకు జరుగ దాయెను. కుత్తి గంటులోని నల్ల పూసలను బోగముదే గ్రుచ్చవలెనట. ఇంత కంటెను మనకు అవమానము గలదా? వ్వభిచారము గర్హ్యముగా నెంచకుండు టట్లుండగా వారలకు తగు వసతులేర్పరచి వంశ పారంపర్యముగ నిదే