పుట:AntuVyadhulu.djvu/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

వృత్తి సలుపు చుండుడని ప్రోత్సాహము చేయుట ఎంతయు శోచనీయము. ఎట్లయినను దేశాభి వృద్ధి గోరు ప్రతి మానవుడును వ్యభి చారమును తగ్గించుటకు తన యావశ్చక్తిని ప్రయత్నములు చేయుట ఈ సుఖ వ్వాధుల వ్వాపకమును తగ్గించుటకు రెండవ సాధనం.

3. సందేహాస్పదమైన సంభోగము చేసిన వారందరును సంభోగానంతరము సంయోగావయములను మిక్కిలి పరిశుభ్రముగ మందు నీళ్లలో కడిగి కొని, వెంటనే మూత్రము విసర్జించు నెడల ఈ వ్యాధులు బహుశః అంటక పోవచ్చును. వ్యాధి యంటి నప్పుడు దానిని దాచి పెట్టక వైద్యుని వద్దకు పోయి వెంటనే చికిత్స చేసి కొనిన యెడల వీని నుండి ఇతరులకంటు అవకాశములు తగ్గి యుండును.

4. కట్టు బట్టలు, చేతి గుడ్డలు, పరుపులు, మంచి నీళ్ళ చెంబులు మంగలి కత్తులు మొదలగు వాని మూలమున చిన్న పిల్లలకు కూడ ఈ వ్యాధులు అంట వచ్చును. కాబట్టి ఒకరు ఉపయోగించిన వస్తువులను చక్కగ శుద్ధి చేయకుండ ఇతరులు ఉపయోగింప రాదు. చంటి పిల్లలకు పాలిచ్చు దాదులకీ వ్యాధులు లేకుండ చూసుకొనవలెను.

5. వ్యభి చారము వలనను, ఈ క్రూర వ్వాధుల వలనను గలుగు అసంఖ్యాకములును అగు దురవస్థలను గూర్చి పిల్లలకు యుక్త వయస్సు రాక పూర్వమే తగిన తరుణమున