పుట:AntuVyadhulu.djvu/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

నందు హెచ్చుగ వ్యాపించు చున్నవి. ఇట్టి మగ వారలీ వ్యాధులను ఏ పాపమెరుగని తమ భార్యలకు పిట్ట పిడుగున మొట్ట మొదటి సంభోగముననే అంటించి వారలను కూడ తమతో పాటు అపారములగు కష్ట సముద్రముల ముంచు చున్నారు. స్త్రీ పురుషులకు తగిన వయస్సు లందు వివాహములు చేసిన వారలకు యన్యోన్య ప్రేమ హెచ్చు నట్లు జేయుట ఈ వ్యాధుల నివారించుటకు మొదటి సాధనము.

2. వ్యభిచారము హెచ్చుగ నుండు ప్రదేశములలో ఈ వ్యాధులు హెచ్చుగ వ్యాపించు చుండుననుట నిస్సందేహము. పల్లెలలో కంటె పట్టణములలో హెచ్చుగ నుండుటకు ఇదియే కారణము. వ్యభిచారమును తగ్గించుటకు ఇరోపా ఖండమునందు ఒక్కొక్క దేశమందొక్కొక్క కాలమునందు అనేక పద్ధతుల నవలంబించిరి.

(అ) వ్యభిచారము వలన జీవించుట స్త్రీలకు లైసెన్సులనిచ్చి వారు తప్ప ఇతరులు వ్వభిచరించిన యెడల శిక్షకు పాత్రులగుదురని నిర్బందించిరి.

(ఇ) లైసెన్సు గల స్త్ర్తీలను వారమునకు ఒకటి రెండు పర్యాయములు డాక్టర్లు పరీక్షించి వారలకే వ్వాధియంటినను తక్షణమే వైద్య శాలలకు పంపి కుదుర్చుచు, వ్వాధి గల దినములలో వారలితరులకీ వ్యాధుల నంటింప కుండ కాపాడు చుండిరి.