పుట:AntuVyadhulu.djvu/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

213

ప్లేగు సూక్ష్మ జీవులను ఎలుకల నుండి తామే చేర వేయునది నిజమైనను కాక పోయినను, మన శరీరము మీద అదివరకే పడి యున్న సూక్ష్మ జీవులు గోమారు కాటు వలన గలిగిన గాయము గుండా మన రక్తములో ప్రవేశించి వ్యాధి కలుగ జేయ వచ్చును. గోమారుల వలన కాక పోయినను ప్లేగు అంటిన ఎలుకలు ఇంటి యందు విచ్చల విడిగ సంచరించుట చేతను వాని మూత్రపురీషాదుల ఇండ్లలో నలు ప్రక్కల పడి యుండుటకు అవకాశము కల్గి యుండుట చేతను ఎలుకలు ప్లేగు యొక్క వ్యాపకమునకు ఎక్కువగ సహాకారులగునని చెప్ప వచ్చును. మానవుల రాక పోకలచే గాని బట్టల చేగాని ఇతర జంతువుల చేత గాని ఒక చోటు నుండి మరియొక చోటికి ప్లేగు వ్యాధి వ్యాపింవ వచ్చును. బెంగళూరు మొదలగు ప్రదేశములలో రైలు నుండి దిగుమతి యగు సామాగ్రుల తో పాటు ఎలుకలు కూడ దిగుమతియయి వాని మూలముననే తరచుగ ప్లేగు వ్యాపించు చున్నట్లు నిదర్శనములు గలవు.

నివారించు పద్ధతులు

ఒక దేశము లోనికి ప్లేగు సంబంధమైన అంటు వ్యాపింప కుండ రహదారీ స్థలముల యందును రైలు స్టేషనుల యందును, ఓడ రేవుల యందును తగినంత మంది ఉద్యోగస్థులను కాపలా యుంచ వలయును. ఒక వేళ వ్యాధి ప్రవేశించిన యెడల రోగులను ప్రత్యేక పరచి వ్యాధి వ్యాపింప కుండ పండ్రెండు