Jump to content

పుట:AntuVyadhulu.djvu/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

పదమూడవ ప్రకరణములో చెప్పిన ప్రకారము జాగ్రత్త పుచ్చు కొనవలయును. అనుమాన స్పదమగు ప్రదేశములలోని జనులకందరకు ప్లేగు టీకాలు వేయ వలెను.

కుష్ఠరోగము

(Leprosy)

ఇప్పటికి 3400 ల సంవత్సరల క్రిందటనే కుష్ట వ్యాధి మనదేశమున ఉన్నట్లు నిదర్శనములు గలవు. ఈ వ్యాధిని గలిగించు సూక్ష్మ జీవులు ఒక రోగి నుండి మరియొకరికి వంశ పారం పర్యముగ వచ్చునని కొందరును, రోగిని ఇతరులు తాకుటచే అంటుకొనునని కొందరును ఊహించు చున్నారు. కుష్టరోగుల యొక్క శరీరము లందు ఈ సూక్ష్మ జీవులు కనబడు చుండుట చేతను, కుష్టరోగము లేని జనులందెన్నడును ఈ సూక్ష్మ జీవులు కనబడక పోవుట చేతను, ఈ వ్యాధికిని ఈ సూక్ష్మజీవులకును తప్పక సంబంధమున్నదని చెప్పవచ్చును. కాని ఒక అరోగి నుండి ఎత్తిన సూక్ష్మ జీవులను వేరొకని శరీరమునందు బలవంతముగ ఎక్కించి వానికి ఈ వ్యాధి అంటు కొనునా లేదా అని శోధించుటకు వీలుగాక పోవుట చేత ఈ సూక్ష్మ జీవులే ఈ వ్యాధికి కారణమను అంశము కొంచెము సందిద్గముగ నున్నను, ఇతర అంటు వ్యాధులకును దీనికి గల పోలికలను బట్టియు, ఇది యొకరి నుండి మరియొకరికి అంటు మార్గములను బట్టియు చూడగా సూక్ష్మ జీవులే మూల కారణములని స్పష్టమగు చున్నది.