పుట:AntuVyadhulu.djvu/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

శించినను ప్రవేశింప వచ్చును. మనము తినిన ఆహారము కడుపు లోనికి పోయి నప్పుడు అక్కడ నేదైన, స్వల్పముగ నైన, గాయముండిన గాని ఈ సూక్ష్మ జీవులు రక్తములోనికి చేరలేవని కొందరి అభిప్రాయము. ప్లేగు సంపర్కముగల ఆహారము తినినపుడు దాని యందలి, సూక్ష్మ జీవులు పెదవుల యందును చేతుల యందును నుండు చిన్న చిన్న గాయముల గుండా కూడ ప్రవేశిచునని నిదర్శనములు గలవు. దురదచే గోకి కొనుట వలన గాని దోమ కాటు వలన గాని పుట్టిన అతి స్వల్పమైన గాయముల మూలమున కూడ ప్లేగు సూక్ష్మ జీవి ప్రవేశింప గలదు. ప్లేగు వ్యాధి నీటి మూలమున ప్రవేశింప దనియు చక్కని ప్రచారము గల వాయువు మూలమున కూడ అంట దనియు చెప్ప వచ్చును. జన సమ్మర్దము అధికముగ కలిగి నట్టి చీకటి ఇండ్లలో ఈ వ్యాధి ప్రవేశించిన మిక్కిలి తీవ్రముగా నాశనము చేయునని నిశ్చయముగా చెప్పవచ్చును. ప్లేగు వ్యాధి కలిగిన యింటిలోని ఎలుకలు కుప్పలు కుప్పలుగ జచ్చును. ఒకానొకప్పుడు గ్రామములో ప్లేగు ప్రవేశింపగనే కొన్ని ఇండ్లలోని మనుష్యులకు ఏవిధమయిన వ్వాధియు సోకక మునుపే ఇంటిలోని ఎలుకలు మిక్కుటముగ చచ్చి పడును. ఈ ఎలుకల శరీరము మీద నివసించు బ్రతుకు చుండు గోమారులు మానవులను కుట్టినపుడు ప్లేగు వ్యాధి ఎలుకల నుండి మానవులకు చేరునని శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ గోమారులు