Jump to content

పుట:AntuVyadhulu.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

207

వాయు ప్రచారము చక్కగ లేని చీకటి ఇండ్లలో నివశించు వారలను, స్వతస్సిద్ధముగ గాని ఇతర వ్యాధులచే పీడింప బడుట చేత గాని బల హీన స్థితిలో ఉన్న వారలు ఈ వ్యాధి అధికముగ అంటు కొనును.

క్షయ వ్యాధి వ్యాపించుటకు రెండు విషయములు ముఖ్యముగ నున్నవి. 1. విత్తనము అనగా క్షయ సూక్ష్మ జీవి. 2. నేల అనగా బలహీన స్థితిలో ఉన్న మనుష్యుడు. వంశ పారంపర్యముగ కొందరు ఈ వ్యాధికి సులభముగ లోనగుదురు. ఇది యొక విధమైన బలహీనతగా నెంచ వలయును.

నివారించు మార్గములు

క్షయ వ్యాధి ఊపిరి తిత్తుల మార్గమున గాని అహారము గుండ గాని చర్మము ద్వారా గాని అక్కడక్కడ అరుదుగ జననేంద్రియముల మార్గమున గాని మన శరీరములలో ప్రవేశించును. క్షయ సూక్ష్మ జీవి చాల సేపు గాలిని గాని వెలుగురును గాని ఎండను గాని భరింప జాలక వెంటనే చచ్చి పోవును. రోగి యొక్క సమీప ప్రదేశములలో గాని ఇతర చోట్లల గాలిలో ఈ సూక్ష్మ జీవులను కనుగొనుట కష్టము. కాబట్టి ప్రతి క్షయ రోగిని తాను ఉమ్మివేయు కఫమునందలి సూక్ష్మ జీవులను నశింప జేయిట నేర్పిన యెడల ఈ వ్యాధి యొక్క వ్యాపకము వెంటనే తగ్గి పోవుటకు సందేహము లేదు. క్షయ అరోగుల కఫమును ఎండ నిచ్చి గాలిలో కలియనిచ్చినను, ఈగలు చీమలు మొదలగు