Jump to content

పుట:AntuVyadhulu.djvu/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేడవ ప్రకరణము


ఇతర సంపర్కము వలన వ్వాపించు వ్యాదులు క్షయ ప్లేగు, కుష్ఠరోగము, కొరుకు, వచ్చ సెగ, తామర, గజ్జి మొదలగునవి.

క్షయ

(Tubercle)

ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవులు క్షయ రోగులు ఉమ్మి వేయు కపము నుండు సాధారణముగా బయలు వెడలు. మన దేశము నందలి ప్రజలు అజాగ్రత్తగ వీదులలోను, ఇష్టము వచ్చిన చోట్ల నెల్ల ఉమ్మి వేయుచుందురు. ఇది ఎండి పొడియై గాలిలో నెగిరి పోవు చుండును. ఈ కఫము తడిగా నున్నప్పుడు ఈగలు దాని మీద వ్రాలి అక్కడ నుండి సూక్ష్మ జీవుల నెత్తుకొని పోయి మన ఆహార పదార్థముల మీదికి చేర బేయును. క్షయ వ్యాధి గల ఆవుల పాల గుండ ఈ వాధి వ్యాపించునను నమ్మకము అనేక వైద్యులకు కలదు. కాని మన దేశమందలి ప్రజలు పాల నెప్పుడు చక్కగ కాచి పుచ్చుకొను అభ్యాసము గల వారగుట చేత ఇక్కడ ఈ వ్యాధి పాల మూలమున అంతగా వ్వాపించు చున్నదని తోచదు. ఈ వ్యాధి వంశ పారంపర్యముగా వచ్చు చుండునను నమ్మకము గట్టిగ కలదు.