పుట:AntuVyadhulu.djvu/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

లగు జంతువులు ఈ కఫమును రోగి ప్రక్కనుండి చేరవేయనిచ్చినను గలుగు అపాయము ఇంతంత అని చెప్ప నలవికాదు. ఈగ లెట్లు మన ఆహార పదార్థముల మీదికి నిరంతరము ఇట్టి విష పదార్థములను తెచ్చి పెట్టుచున్న వో వెనుకనే నొక్కి చెప్పియున్నాము.

ఈగలు సామాన్యముగా ఒక్కొక్క కానుపునకు 120 మొదలు 150 వరకు గ్రుడ్ల నొక ముద్దగా పెట్టును. ఈ గ్రుడ్లు 40 వ. పటములో చూపిన ఆకారము గలిగి, తెల్లగ నిననిగ లాడుచు, జిగురు జిగురుగా నుండును. ఈగ తన గ్రుడ్ల నెప్పుడును పేడ కుప్పలు మొదలగు క్రుళ్ళు పదార్థములు గల చోట్ల బెట్టును. వీలయినప్పుడు మన శరీరము మీది పుండ్లలో కూడ ఇది గ్రుడ్లను పెట్టును. కొన్ని ఈగలు చిన్న పిల్లల ముక్కుల లోను చెవుల లోకూడ గ్రుడ్లు

పెట్టును. ఇవి యిక్కడ వేసవిలో 24 గంటలలోపలను శీత కాలములో రెండు మూడు దినముల లోపలను 41. వ. పటములో చూపినట్లు 12 కణుపులు గల తెల్లని పురుగులుగా పరిణమించును. ఈ పురుగులు తలవైపున సన్నముగను వెనుక వైపున లావుగను మొద్దుగను ఉండును. ముందు వైపున రెండు దట్టమైన పెదవులు గల ముట్టె యుండును. ఈ ముట్టె