పుట:AntuVyadhulu.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

185

వేయుటకు ప్ర్రారంభించిన తరువాత దీని వ్యాపకము యొక్క ఉధృతము మనకంతగా దెలియుకున్నది. ఇప్పుడు టీకాల మూలమున మశూచకపు వ్యాపకము కొంత వరకు నిలుచు చున్నను, అచ్చటచ్చట ఈ వ్యాధి ఇంకను హెచ్చుగ వ్యాపించు చున్నట్లు విను చున్నాము. ఒకానొక కాలమునందు ఒకానొక ఊరిలో నిది యమితముగ వ్యాపించుటయు మరియొక యూరిలో అదే కాలము నందు గాని, వేరొక కాలము నందు గాని ఒకరిద్దరు రోగులకు మశూచకము వచ్చి అంతటితో నీ వ్యాధి నిలచి పోవుటయు గలదు. ఇట్టి వ్యాపకమునకు కారణము కనుగొన వలయుననిన మిక్కిలి జాగ్రత్తతో పరిశోధింప వలసి యున్నది. ఒక్కొక్క ప్రదేశమునందు టీకాల వలని లాభము ప్రజలనుకొని నంతగా నుండక పోవచ్చును. టీకాలు చక్కగా పొక్కినవా లేదా అను విషయము ఆయా గ్రామముల అంతట ఈ వ్యాధి వ్యాపకము యొక్క ఉధృతమును తెలిసి కొనుటలో ముఖ్యమైన అంశము. కాబట్టి ఒక చోట మశూచకము వచ్చిన వెంటనే అనుమాన స్పదమగు జనులందరకు తిరిగి టీకాలు వేయ వలయును.

దేశము యొక్క కాలమాన స్థితికిని, మశూచకపు వ్యాపకమునకును ఎదో ఒక సంబంధము కలదని గూడ తోచు చున్నది. ఒకానొక కాలమందు ఇది మిక్కిలి ఎక్కువగా నుండును. మరి యొక కాలమందు తగ్గి యుండును. కాని అనేక