పుట:AntuVyadhulu.djvu/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

సించి యుండు ఇంటిలోనికి రోగి యున్నప్పుడు గాని, రోగి విడిచిన తరువాత గాని ఇతరులు ప్రవేశించుట చేతను, ఈ వ్యాధి వ్యాపింప వచ్చును. వ్యాధి ప్రారంభించినది మొదలు, పక్కులన్నియు పూర్ణముగా ఊడిపోయి ఆరోగ్యము కలుగు వరకు ఒక రోగి నుండి ఇతరులకు ఈ వ్యాధి అంట వచ్చును. కాని కుండలలో చీము పట్టు దినముల యందు ఈ వ్యాధి మిక్కిలి ఉధృతముగ వ్యాపించ గలదని తెలియు చున్నది. తక్కిన అంటు వ్వాధుల యొక్క మైల కంటె ఈ వ్యాధిని బుట్టించు మైల రోగి నుండి విస్తార దూరము వ్వాపింప గలుగుటచే దీని వ్వాపకమును నిలుపుటకు మిక్కిలి కష్టముగా నున్నది. ఒక గ్రామమున కంతకును అంటించుటకు మరియొక ఊరినుండి ఒక్క మనిషి ఈ వ్యాధిని దీసికొని వచ్చిన చాలు. ఈ విత్తనము పది పదునైదు దినములలోనే చుట్టుపట్ల నున్న ముప్పది నలుబది కుటుంబములకు వ్వాపింప గలదు. ఇది కొంపలంటు కొను నిప్పు కంటె వేగముగ నింటింటికి వ్యాపించు నని చెప్పవచ్చును.

నివారించు పద్ధతులు

రోగిని వెంనే ప్రత్యేక పరచుట చేతను, రోగి యుండు స్థలమును వెంటనే శుద్ధి చేయుట చేతను, ఈ వ్యాధి యొక్క వ్వాపకము కొంత వరకు నిలుప వచ్చును గాని దీని వ్యాపకము గాలితో సమానమైన వేగము గలదగుట చేత ఇంతటితో నిలుచునని చెప్పుటకు వీలు లేదు. మశూచికము రాకుండ టీకాలు