Jump to content

పుట:AntuVyadhulu.djvu/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

చోట్ల ఈ వ్యాపకము మానవుల రాక పోకలను బట్టియే ఉండునని తోచుచున్నది. మశూచకము వచ్చిన వాని చుట్టు అదృష్ట వశమున టీకాలు వేయించు కొనిన వారే యుండి రోగి యొక్క వ్యాధి మశూచకమని మొదటి దినమే తెలిసి యుండి, రోగిని వెంటనే ప్రత్యేక పరచి రోగిని చూచుటకు ఇతరులు ఎవ్వరును పోకుండ నుండిన ఎడల ఆ వ్యాధి అంతటితో దిగిపోయి వుండ వచ్చును. అధికారులు ఈ రోగి విషయమై వెంటనే తెలిసికొని రోగితో సంబంధించిన వారల కందరుకును చుట్టు పట్లనుండు ఇండ్ల వారి కందరుకును వెంటనే టీకాలు వేసి, రోగిని గ్రామము వెలుపల నుండు ప్రత్యేక స్థలమున ఉంచిన యెడల ఇంకను యుక్తము. కాని ఈ విషయములను గూర్చి బొత్తిగ అజ్ఞానములో మునిగి యున్న మన దేశమునందు ఇట్టి స్థితి ఇంతలో వచ్చునని తలచుటకు వీలులేదు. రోగికి వ్యాధి అంటిన మొదటి దినములలో ఏదో కొద్దిగా జ్వరము తగిలినదని తలచి అమ్మవార ని తెలియక పూర్వము, మామూలుగా దిరుగుచు తన పనులు జేసికొను చుండుట వలనను, ఊరంతయు దిరుగు చుండు అద్దె బండ్లలోను, రైలు బండ్లు లోను తిరుగుటచే ఆ బండ్ల మూలమునను, నాటకములకును సభలకును బోవు చుండుట చేతను ఈ వ్యాధి రోగి మూలమున ఎట్లు వ్యాపింప గలదో తెలియగలదు. అమ్మారని తెలిసిన తరువాత, రోగి ఇంటిలో పరుండి యున్న తరువాత గూడ ఆ యింటిలోని పిల్లలు బడికి