పుట:AntuVyadhulu.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

181

రాలేదు. అంత వరకును వ్యాధిని పుట్టిచుటకు సహాయ పడు ఇతర కారణములను మనము గమనించుచు సాధ్యమైన వరకు వ్యాధి యొక్క వ్యాపకము నణచుటకు ప్రయత్నింప వలెను. ఇది అంటు వ్యాధి యని మనకిప్పుడు తెలిసి యున్నది గనుక విరేచనములను మందు నీళ్లతో గలిపి కల్మష మితరులకు అంటు కొన కుండ చూడ వలెను. ఇంటి చుట్టు నుండు నేల యందును, మంచి నీళ్ల యందును, మలమూత్రాదుల సంపర్కము చేర కుండ చూడ వలెను. వ్యాధి యున్న స్థలములలో నివశించు వారు నీటిని చక్కగ మరగ నిచ్చి చల్లార్చుకొని త్రాగవలెను.