పుట:AntuVyadhulu.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

టకు ప్రబల కారణము గలవు. నీటిలోని మట్టి కడుపు లోనికి పోయి అక్కడ పుండు పుట్టించి క్రమముగ బాసిల్లును గ్రహణి లోనికి గాని అమీబా గ్రహణ లోనికి గాని దింపును.

మట్టితో గాని, ఇతర కల్మషముతో గాని కూడిన ఆహారము, అజీర్ణ పదార్థము, పచ్చివి గాని మిగుల మగ్గినవి గాని పండ్లు, హెచ్చుగను మితి లేకుండగను జేయు పండుగ భోజనములు, అతి త్రాగుడు మొదలగునవి గ్రహణి యొక్క వ్యాపకమునకెక్కువ సహాయము చేయును. యుద్ధ కాలము లందును క్షామ కాలము లందును, ఆహారాదులు సరిగా లేక పోవుట, అధిక పరిశ్రమ జేయుట, ఎండను వానను లెక్క చేయక పోవుట, తడినేలను పరుండుట, జన సమ్మర్దము, మురికి నీరు, మలమూత్రాదులతో కల్మషమైన నీరు ఇవి యన్నియు ప్రబల హేతువులు.

స్వభావము

అన్ని జాతుల వారికిని అన్ని వయసుల వారికిని వ్వాధి సమానముగా అంటును. స్త్రీ పురుష వివక్షత లేదు. భాగ్యవంతుల కంటె బీద వారిని ఇది హెచ్చుగ బాధించును. పెద్ద పట్టణములలో కంటె పల్లెల యందును, చిన్న పట్టణములందును ఈ వ్యాధి హెచ్చుగనుండును.

నివారించు పద్ధతులు

ఈ వ్యాధిని రాకుండచేయు టీకారసము కనుగొనుటకు ప్రయత్నించుచున్నారు కాని ఇంకను ఉపయోగములోనికి