పుట:AntuVyadhulu.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

179

కొలదిని గ్రహిణి తగ్గు చున్నట్లు కానవచ్చు చున్నది. అయినను నేల యొక్క స్వభావమును బట్టియు, నీటిని బట్టియు, గాలిలో నుండు తడిని బట్టియు, ఈ వ్వాధి వ్వాపకమును మారు చుండును. ఈ దేశములో సాధారణముగా బురదతో కూడిన క్రొత్త నీరు వచ్చు కాలములో గ్రహణి హెచ్చుగ నుండును.

దేశము యొక్క శీతోష్ణ స్థితి యందు అధిక మగు మార్పులు అకస్మాత్తుగ కలిగినప్పుడెల్లను గ్రహణి యొక్క వ్యాపకము హెచ్చునని తోచు చున్నది. మిక్కిలి గేడిగ నుండు వేసవిలో అకస్మాత్తుగ చల్లని దినము వచ్చినను, అధిక పరిశ్రమచే శరీరము వేడి యెక్కి యున్నప్పుడు చలిగాలి తగులుట చే గానీ, తడియుట చే గాని తడి బట్టలు కట్టుటచే గాని గ్రహణి అంకురించును. చెరువులు కాలువలు మరమ్మతు చేసిన సంవత్సరములలోను, చెరువులు బొత్తిగ ఎండి పోయి కొత్త నీరు ప్రవేశించిన సంవత్సరము లోను గ్రహణి తక్కిన సంవత్సరములలో కంటే హెచ్చుగ నున్నట్లు కాన వచ్చు చున్నది. నేల కాలుటకును ఈ వ్యాధి వ్వాపకము నకును గల సంబంధమేమో ఇంకను తెలియదు.

విరేచనములచే మయిల పడిన నేల గాని నీరు గాని కలరా యొక్క వ్యాపకమున కెట్లో గ్రఃహణి యొక్క వ్యాపకమునకట్లే సహాయ పడును. మంచి నీళ్ల చెరువుల లోనికి కల్మషము ఎప్పుడు చేరునో అప్పుడు గ్రహణము వచ్చుట నిశ్చయము. ఇది గాక నీటిలో నుండు మట్టి వలన గ్రహ వచ్చునను