178
విరేచనమునకు పోవు నప్పుడీ వ్యాధిలో ఆసనము నొప్పి మొదటి నుండియు మిక్కిలి హెచ్చుగ నుండును. కుదిరిన వెంటనే కుదురును లేదా వెంటనే చంపును. రెండవ జాతి వ్యాధి అనగా అమీబా గ్రహణి మెల్ల మెల్లగ అంకురించి మధ్య మధ్య కుదురుచు తిరిగి తిరిగి వచ్చును. చాల కాలము వరకు విడువక యుండును.
వ్యాపించు విధము
బాసిల్లసుగ్రహిణి: ఇది యుద్దము గాని , క్షామము గాని వచ్చినప్పుడు తప్పక బయట పడును. ఇది ముఖ్యముగా ఉష్ణ ప్రదేశములందు మిక్కిలి హెచ్చుగ వ్యాపించును. హిందూ దేశములందు మిక్కిలి హెచ్చుగ వ్యాపించును. హిందూదేశమునందు మరణ కారణములలో చలిజ్వరము తరువాత బహుశః గ్రహిణి విరేచనములచే కలుగు మరణములు హెచ్చుగ లెక్కకు వచ్చును. సముద్ర తీరములలోనూ, పల్లపు భూములలోను, మిట్ట ప్రదేశములలో కంటె ఈ వ్వాధి హెచ్చుగ వ్యాపించును. సముద్రపు మట్టము కంటె నూరు అడుగుల లోపల ఎత్తుగల ప్రదేశములలో మొత్తము వ్యాధులలో నూటికి 42 గురును, 500 అడుగుల లోపు ఎత్తుగల ప్రదేశములలో నూటికి 32 గురును, 500 మొదలు 8000 అడుగుల ఎత్తుగల ప్రదేశములలో నూటికి 19 గురును, 8000 అడుగుల కంటె హెచ్చు ఎత్తుగల ప్రదేశములలో నూటికి 4 గురును, గ్రహణి చే బాధ పడుచున్నారు. కాబట్టి సాధారణముగా నేల ఎత్తయిన