182
పదునారవ ప్రకరణము
గాలిమూలమున వ్యాపించు వ్యాధులు
ఇవి మశూచకము, పొంగు, ఆటలమ్మ, కోరింత్గ దగ్గు, గవదలు, డెంగ్యూ జ్వరము, న్యూమొనియా మొదలగునవి. ఇందు కొన్ని వ్వాధులను కలిగించు సూక్ష్మ జీవులులను ఇంకను మనము కండ్లతో చూడలేదు. మశూచక రోగి యొక్క పొక్కుల పైనుండు పక్కులలో ఈ సూక్ష్మ జీవులుండి అవి ఎండి ధూళియై గాలిలో కొట్టు కొని పోవుచు చాల దూరము వరకు వ్వాపించునని ఇప్పటి సిద్ధాంతము. రోగిని ప్రత్యేక పరచుటను గూర్చియు టీకాలు వేసి రక్షణ శక్తిని గలిగించుటను గూర్చియు ఇదివరలో వ్రాసిన దానిని గమనించ వలయును. అపరి శుభ్రత, జన సమ్మర్దము ఇవి ఈ వ్యాధుల వ్యాపకమునకు మిక్కిలి సహ కారులని జ్ఞప్తియుంచుకొని వానిని రెంటిని చేరనీయ కుండు ప్రయత్నము ఎడతెగక చేయు చుండ వలెను.
మశూచకము
ఒకరినుండి మరియొకరికి వ్యాపించు వ్వాధులలో మశూచకము మిక్కిలి ఉద్రేకమైనది. దీని యంత త్వరగా వ్యాపించు అంటు వ్వాధి మరొకటి లేదు. ఇతర జ్వరముల వలె దీనినొక జ్వరముగా నెంచ వలయును. కాని ఈ జ్వరము నందు మూడవ