పుట:AntuVyadhulu.djvu/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

175

జీవింప నేరవు. మురుగు కుండ్లలోని నీటిలో వేసినపుడు ఈ సూక్ష్మ జీవులు వెంటనే చచ్చి పోవును.

ఇవి సామాన్యముగా మంచి నీళ్లగుండా కాని పాల మూలమున గాని ఉడక పెట్టకుండ తినిన శాఖ పదార్థముల మూలమున గాని మన శరీరములో ప్రవేశించును. సన్ని పాత జ్వరముచే చచ్చిన జంతువుల మాంసమును తినుట వలన సన్ని పాత జ్వరము రావచ్చునని చెప్పుటకు కొన్ని నిదర్శనములు గలవు.

వ్వాధి వచ్చిన ఒక మనిషి నుండి మరియొక మనిషికి సంపర్కము వలన ఈ వాధి అంట వచ్చుననుట నిశ్చయము. రోగి యొక్క బట్ట లుతుకు వార్లకును మలమూత్రాదులను పడకలను తాకుచు చేతులను శుద్ధి చేసి కొనని వార్లకును ఈ వ్యాధి తరచుగ అంటు చుండును. ఈగలు మొదలగు కొన్ని జంతువులచే నిది వ్వాపింప వచ్చునని చెప్పుదురు గాని ఈ విషయమై నిశ్చయముగ చెప్పుటకు ఇంకను నిదర్శనము చాలవు.

వయస్సు: ఆరు నెలలలోపు వయస్సు గల పిల్లలకు ఈ జ్వరము అక్కడక్కడ వచ్చు చున్నను మూడు సంవత్సరముల లోపు బిడ్డలకు తరుచుగా కాన రాదు. ఒకప్పుడు వచ్చినను సులభముగా పోవును. సామాన్యముగా ఈ వ్వాధి 15 సంవత్సరములు మొదలు 25 సంవత్సరముల లోపు వయస్సుగల వార్లకు వచ్చు చుండును. 10 సంవత్సరముల వయస్సు మించిన పిమ్మట ఈ జ్వరము వచ్చుట అరుదు. కాని 90 సంవత్సర