పుట:AntuVyadhulu.djvu/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

వ్యాపించు విధము

సన్నిపాత జ్వరమును కలిగించు సూక్ష్మ జీవిని "ఈబర్తు." అను నతడు 1880 సంవత్సరములో కనిపెట్టెను. ఈ సూక్ష్మ జీవి రోగుల నెత్తురు నందును పేగుల యందును, ప్లీహము మొదలగు కొన్ని అవయవముల యందును కనబడును. తల్లికి వ్యాధి వచ్చినపుడు అప్పుడే పుట్టిన బిడ్డల అవయవములలోను, మాయనుండి వచ్చు నెత్తెరు యందును ఈ సూక్ష్మ జీవి కాన వచ్చు చున్నది. ఇది మొదటి 15 దినముల వరకు తరుచుగాను, తర్వాతి దినములలో అప్పుడప్పుడును రోగి యొక్క విరేచనములలో కాన వచ్చును. రోగి యొక్క మూత్రము నందును, చెమట యందును, ఉమ్మి యందును కూడ ఈ సూక్ష్మ జీవి యుండ వచ్చును. రోగి యొక్క కురుపుల నుండి వచ్చు చీమునందు కూడ చాల కాలము వరకు ఒకానొకప్పుడు కొన్ని సంవత్సరముల వరకును సూక్ష్మ జీవి కాన వచ్చు చుండును. ఈ సూక్ష్మ జీవి అంగుళములో 12 వేల వంతు ప్రమాణముండును. దీని శరీరము కంటె పెద్దవైన తోకలు 10 మొదలు 24 వరకుండును. 26 వ పటము చూడుము. మనము చేయి పెట్టలేని వేడి నీళ్లలో ఇరువది నిముషములలో ఇది చచ్చి పోవును. కాని మంచు గడ్డలో సహితము జీవించి యుండగలవు. మంచి నీళ్లలో ఇవి కలిసినపుడు సామాన్యముగా నివి కొద్ది కాలములో చచ్చి పోవును. ఇతర సూక్ష్మ జీవులు జీవించు చోట ఇవి చిరకాలము