పుట:AntuVyadhulu.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

ములు మించిన వారికి కూడ అచ్చటచ్చట వచ్చి యున్నది. స్త్రీ పురుష వివక్షత లేదు.

స్వభావము: కొన్ని కుటుంబములలో సన్నిపాత జ్వరము హెచ్చుగ వచ్చు చుండును. మరికొన్ని కుటుంబలులలో వచ్చినను సులభముగ తేలిపోవు చుండును. శరీర దార్డ్యమునకును సన్ని పాత జ్వరము అంటు కొనుటకును సంబంధమున్నట్టు కాన రాదు. ఒక సారి సన్ని పాత జ్వరము వచ్చి కుదిరిన తర్వాత రెండవ సారి రాదని తోచు చున్నది. అయినను వ్యాధి వచ్చి కుదిరిన కొద్ది దినములలోనే రోగము తిరుగ బడి తిరిగి మూడు నాలుగు వారములు ఈ వ్యాధి బాధించు చుండుట పై చెప్పిన విషయమునకు వ్వతి రేకముగా తోచు చున్నది. ఈ విషయమై ఇంకను నిశ్చయముగా తెలియ లేదు.

నివారించు పద్ధతులు

నీటి యొక్క పరిశుబ్రతను గూర్చియు మల మూత్రాదులను శుద్ధి చేయు పద్ధతులను గూర్చియు రోగిని ప్రత్యేక పరచుట మొదలగు విషయములను గూర్చియు కలరా వ్యాధి క్రింద వ్రాసిన వాని నన్నిటిని చక్కగ గమననించిన యెడల సన్ని పాత జ్వరమును ఇతరులకు వ్యాపింప కుండ చేయుట మిక్కిలి సులభము. రోగికి జ్వరము వచ్చిన వెంటనే పరుండ బెట్టి బెడ్ పాన్(bed..pan) మొదలగు పాత్రములలో మంచము మీదనే మల మూత్రాదులు జరుగు చున్నట్లు ఏర్పాటు చేసికొని వానిని వెంటనే