పుట:AntuVyadhulu.djvu/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

37.వ.పటముం.

నీటి ఉపరి తలము.





1. అనాఫలీసు దోమ పిల్ల. 2. క్యూలెక్సు దోమ పిల్ల.

(ఇవి రెండును దోమ గ్రుడ్లనుండి పిట్టిన నీటి పురుగులు. వీటి నుండియే రెక్కలు గల దోమలు పుట్టును.)

చేయుటకు తగి యుండు గోతులు బురద నేలలు మొదలగు వాని యందలి నీటి నంతయు నెప్పటికప్పుడు మురుగు కాలువల మార్గమున పోగొట్టి వేయవలెను. గ్రామమునకు అరమైలు దూరములోపల ఊడ్పు చేలుండ కూడదు. పంట కాలువలో గడ్డి మొదలగు తుక్కు పెరుగ నియ్యకూడదు.

గ్రామము నందలి పాడు నూతులను, దొడ్లలోను ఇటుకల ఆవముల వద్దను రోడ్ల ప్రక్కలను ఉండు కొలుములను పూడ్చి వేయవలెను. పూడ్చి వేయరాని పాడు నూతులలోనుండు నీటి పైన కిరసనాయిలును వారమున కొక సారి పోయు చుండవలేను. అట్లు చేయుటచే ఆనీటి యందలి దోమ పిల్లలు నీటి యుపరి తల