Jump to content

పుట:AntuVyadhulu.djvu/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

159

మునకు వచ్చి అక్కడ పీల్చుటకు గాలి లేక ఉక్కిరి బిక్కిరియై చచ్చిపోవును. ప్రజలకు ఉపయోగ కరములగు చెరువులలోను గుంటలలోను చేపలను పెంచ వలెను. ఈ చేపలు దోమ పిల్లలను తిని వేయును.

ఇండ్లలోనుండు నూతులలో దోమ పిల్లలను పెట్టు చున్న యెడల దోమలు చొరలేని దోమ తెరల వంటి ఇనుప వలలతో నూతులను రాత్రుల యందు కప్పివుంచ వలెను. ఇండ్లలోను, దొడ్ల లోనుండు కుడితి తొట్లలోను, పగిలి పోయిన డబ్బాలలోను, కుండ పెంకులలోను, నీరు నిలిచి యుండకుండ చేసికొన వలెను. లేని యెడల దోమ పిల్లలకు ఈ నీరు నివాస స్థానముగా ఏర్పడుడును. ఇండ్ల చుట్టు నుండు చెట్ల తొర్రలలో నీరు లిలిచి అందు దోమలు పిల్లలను పెట్టకుండ చూచుకొనుచుండ వలెను. చక్కెర డబ్బాల క్రిందను మంచము కోళ్ళ క్రిందను పెట్టు పళ్లెములలో నీరు రెండు మూడు దినముల కొక సారి మార్చు చుండవలెను. లేని యెడల వీనిలో పెరిగిన దోమ పిల్లలు ఇల్లంతయు క్రమ్మి వేయ గలవు.

గ్రామ ఉధ్యోగస్తులు గాని, శానిటరీ ఆపీసర్లు గాని జవానులు గాని వారమున కొక సారి ప్రతి యింటిని చక్కగ శోధించి, దోమలకు ఉనికి పట్టుగల స్థలములు ఎక్కడను లేకుండ చేయవలెను. దోమ పిల్ల లెక్కడెక్కడ పెరుగునో, వాని వలన గలిగెడు ఉపద్రవమెట్టిదో ప్రజలకు చక్కగ బోధించు