Jump to content

పుట:AntuVyadhulu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ఇప్పుడు క్రీసాలు, (Cresol) లైసాలు (Lysol) క్రియాలిన్ (Creolin) ఐజాల్ (Izol) లైసోఫారం (Lysoform) సిల్లిన్ (Cyllon) మొదలగు అనేక మందులు విక్రయమునకు దొరకును. ఇవి కార్బాలిక్ ఆమ్లము కంటే శుద్ధి చేయు శక్తి కొంచెము హెచ్చుగ గలవి. ఇవి చేతులయందంతగా మంట పుట్టింపవు. నీళ్లలో దాని కంటె సులభముగ కలియును. కాని వెల కొంచెము అధికమగును.

2. ఫార్మనిలు (Formalin). ఇది కార్బలికామ్లము కంటె తీవ్రమైన శక్తి గలది. కార్భాలికామ్లము వలె విషము కాదు. పాలు చేపలు మొదలగు భోజన పదార్థములలో సూక్ష్మ జీవులు చేరి పాడు కాకుండ ఈ ఫార్మనినును కొందరిపుడు ఉపయోగించెదరు. నూరు పాళ్లు నీళ్ళలో రెండు పాళ్లు దీనిని చెర్చిన ద్రావకము 15 నిముషములు మొదలు గంట లోపల సూక్ష్మ జీవులన్నిటిని చంపి వేయును. సౌవీర ద్రావకము వలె నిది సబ్బు నీటిని విరిచి వేయదు. కాబట్టి చేతులు తోము కొనుటకు, ఆయుధము బట్టలు మొదలగువని శుద్ధి చేసి కొనుటకు ఇది మిక్కిలి ఉపయోగ కరము. కోసి వేసిన కంతులు మొదలగు వానిని నిలువ చేయుటకు ఇది మిక్కిలి