పుట:AntuVyadhulu.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

145

అన్నిటి కంటె ఎక్కువ ఉపయోగకర మైనదని చెప్పవచ్చును. కాని అతి ప్రమాదకరమైన విషమగుటచే దీనిని కొందరు బహిష్కరిస్తున్నారు. 3 గురిగింజలెత్తు తినిన యెడల మనుష్యుని చంపుటకు చాలును. ఇట్టి ప్రమాదము అనేక చోట్ల కలిగి యున్నవి. కలరా వ్వాధి వచ్చిన ఇంటి యందు ఈ మందును మాత్ర రూపముక నుంచు కొని ఒక్కొక్క మాత్రను కొలత ప్రకారము తగినన్ని నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్లలో తరుచుగ చేతులను కడుగుకొను చుండవలెను. కాని ఈ మాత్రలను ఏర్పాటుగ ఒక చోట బెట్టుకొని ఇతర మందులతో కలియ కుండ జూచుకొనవలెను. మిక్కిలి ఆప్తులగు రోగులు చని పోయినప్పుడా ఇంటిలోని స్త్రీలు మొదలగు వారీ మాత్రలను సంగ్రహించి మ్రింగి ఆత్మ హత్య చేసి కొనకుండ నెల్లప్పుడు జాగ్రత్తగ నుండ వలెను. సౌవీర ద్రావకమును తయారు చేసికొను మాత్రలో ఎల్లప్పుడు కొంత నీలి మందు కాని మరి ఏదైన రంగు గాని కలిపి ఈ మందు నీళ్లను తక్కిన మందుల నుండి గుర్తించుటకు వీలుగా చేసి కొనవలెను.

ఒక పాలు సౌవీరము పదివేల పాళ్లు నీళ్లలో చేరియున్నను, ఆ ద్రావకము సామాన్యముగా అన్ని జాతుల సూక్ష్మ జీవులను చంపగదు. వేయింటి కొక పాలు సౌవీర ముండిన మందు నీళ్లు నిశ్చయముగ నన్ని జాతుల సూక్ష్మ జీవులను రెండు మూడు నిముషములలోనే చంపి వేయును. విరేచనము,