Jump to content

పుట:AntuVyadhulu.djvu/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

143

లేకున్నను, సామాన్య ద్రావకము సూక్ష్మ జీవుల పెంపును నిశ్చయముగ అణచి వేయ గలదు. ఇది సౌవీర ద్రావమువలె ఆయుధములను పాడు చేయదు. అందు చేతనే దీనిని శస్త్ర వైద్యులు ఆయుధములను శుద్ధి చేసికొనుటకు హెచ్చుగ ఉపయోగింతురు. నూరు చుక్కల నీళ్ల కొక చుక్క కార్బాలికామ్లము గల నీటిలో దొమ్మ (antrax) సూక్ష్మ జీవులు చచ్చుటకు రెండు దినములు పట్టుననియు, టైఫాయుడు సూక్ష్మ జీవులు జీవించి యుండగలవనియు ప్రొఫెసర్ కాకు అను వారు వ్రాసి యున్నారు.

సీమ సున్నము వంటి ఏదో యొక పదార్థము నందు నూటికి ఇంత ని లెక్క చొప్పున కార్బాలిక ఆమ్లమునే కలిపి బజారులో అనేక కార్బాలికు పొడుములు అమ్ముదురు. వీనిలో ఎన్ని పాళ్ళు కార్బాలి కామ్లమున్నదో నిశ్చయము తెలిసియున్నను గాని వీని నుపయోచించి ప్రయోజనము లేదు. నూటికి 15 పాళ్లకంటె తక్కువగ నున్న మందులు అంటు వ్వాధులను నివారించునని బొత్తిగ నమ్మకూడదు. ఫినైలు అని అమ్మబడు ద్రావకములో కూడ ఈ కార్బాలిక ఆమ్ల సంబంధమైన వస్తువులే కలవు. చేతులు కడుగు కొనుటకు నూటికి 2 మొదలు 5 వరకు ఈ కార్బాలిక్ ఆమ్లమును వేడి నీళ్లలో చక్కగ కలియు నట్లు కలిపి ఉపయోగింప వలెను. చన్నీళ్ళలో ఇది కలియక బొట్లు బొట్లుగా నుండును. అట్టి నీళ్ళలో చేతులు గడిగిన పుండ్లు పడును.